CID chief Charu Sinha | ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై తెలంగాణ సీఐడీ కీలక ఆపరేషన్ చేపట్టింది.. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ నిర్వహిస్తున్న 11 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు నిందితుల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. అరెస్టు అయిన వారిలో నిర్వాహకులు వారి సహాయకులు ఉన్నట్లు గుర్తించారు.
. నిందితుల నుంచి భారీగా బెట్టింగ్ నిర్వాహణకు వినియోగించే పరికరాలు, మొబైల్స్, లాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
ఈ విషయమై సీఐడీ చీఫ్ చారు సిన్హా మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్‌పై సిట్ ఏర్పాటు చేసిందని..ఆన్ లైన్ బెట్టింగ్ కేసులను CIDకి బదిలీ అయిన కేసులను విచారణ చేస్తున్నామని CID చీఫ్ చారు సిన్హా ప్రకటించారు. కరీంనగర్లో నమోదైన డాఫా బెట్ కేసును CID ఛేదించింది. 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ను సీజ్ చేశాం.ఈ కేసులో ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా ఆర్గనైజర్లు రోజుకు 8 నుండి 10 లక్షలు సంపాదిస్తున్నారు.40 మంది అధికారులు ఈ కేసును విచారణ చేశారు. 15 రోజుల CID ఆపరేషన్ లోఢిల్లీ, గుజరాత్, పంజాబ్ లో 11 మందిని అరెస్ట్ చేశారు.ఇది ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ దందా.ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో పాన్ ఇండియా ఆపరేషన్ చేసి నిందితులను అరెస్ట్ చేశాము.
ఈ డాఫా బెట్ పై 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు 73 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని చారుసిన్హా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేసిన సీఐడీ108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ గుర్తించి భారత ప్రభుత్వ ప్రతిపాదనలు పంపిన సీఐడీఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో 37 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లు తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉండేలా జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసిందన్నారు. 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలను కౌన్సిలింగ్ చేసిన సీఐడీ ఆన్ లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు , ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక్క చాన్స్ ఇచ్చాం. వారికి కౌన్సెలింగ్ చేశాము. రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో 414 కేసులు నమోదు, 108 బెట్టింగ్ యాప్ లు బ్లాక్ చేశామన్నారు.