హైదరాబాద్: కోడి మాంసం ధరలు కొండ దిగుతున్నాయి. చాలా రోజులుగా రూ.200 దిగువకు రాని చికెన్ ధర ఇప్పుడు అకస్మాత్తుగా రూ.160కి పడిపోయింది. గత వారం కూడా రిటైల్ మార్కెట్లో కిలో రూ.200కు పైగా ఉన్న కోడి కూర ధర ఆదివారం అమాంతం దిగివచ్చింది. కరోనా కారణంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మాంసం, గుడ్లు వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచించడంతో చికెన్, కోడిగుడ్ల వినియోగం బాగా పెరిగింది. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి చికెన్ ధర తగ్గడానికి కారణం వేసవిలో కోళ్లు ఎక్కువగా చనిపోతుండటమేనని తెలుస్తున్నది.
అయితే, కరోనా మొదటి వేవ్ సందర్భంగా కోళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని ప్రచారం జరిగింది. దాంతో జనం కోడి కూరను దూరం పెట్టారు. దాంతో అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కారణంగా పలుచోట్ల రూ.100కు ఒక కోడి చొప్పున అమ్మారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.100కు రెండు కోళ్లను కూడా ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే కోళ్లను ఉచితంగా పంచిపెట్టారు కూడా. అయితే క్రమంగా కరోనా వేవ్ తగ్గడం, నిపుణులు కూడా కోడి మాంసం తీసుకోవాలని సూచించడంతో చికెన్‌కు మళ్లీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ రూ.160 స్థాయికి పడిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
మమతాజీ.. బెంగాలీలు ఎవరికీ భయపడరు: జేపీ నడ్డా
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు