Attack | వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై వంటవాడి దాడి
Attack | కొంత కాలం క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో నూకరత్నంకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో గత నెల ఫిబ్రవరి 20న వారు వివాహం చేసుకున్నారు. ఆలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి నూకరత్నం పని చేసే చోటే వంట వాడిగా పనిచేస్తున్నాడు.
Attack | మియాపూర్, మార్చి 21: తనను కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై ప్రియుడు, అతని తండ్రి కలిసి కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాకినాడకు చెందిన నూకరత్నం(25)అనే మహిళ మియాపూర్‌లోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటూ హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. గతంలోనే భర్తను కోల్పోయిన నూకరత్నానికి ఇద్దరు కూతుళ్లున్నారు.
కొంత కాలం క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో నూకరత్నంకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో గత నెల ఫిబ్రవరి 20న వారు వివాహం చేసుకున్నారు. ఆలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి నూకరత్నం పని చేసే చోటే వంట వాడిగా పనిచేస్తున్నాడు. అయితే నూకరత్నంను ఇష్టపడ్డ ఆలీషా అలియాస్ పాండుకు ఆమె తనకు చెప్పకుండా ప్రసాద్‌ను పెళ్లిచేసుకోవడంతో కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఆలీషా ఈ నెల 19వ తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లాడు. తనతో రావాలని నూకరత్నంతో అలీషా గొడవ పడగా.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆలీషా తన వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. నూకరత్నంపై దాడికి పాల్పడ్డ నిందితులు ఆలీషా, అతని తండ్రి లాలూను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also :
బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

