ఉన్నత విద్యామండలి ముట్టడి
ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు చెల్లించి, యధాతథంగా స్కీమ్‌ను కొనసాగించాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
- రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగించాలని డిమాండ్
- మద్దతు పలికిన మధుసూదనాచారి, ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాలు
మెహిదీపట్నం, ఆగస్టు 3: ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు చెల్లించి, యధాతథంగా స్కీమ్‌ను కొనసాగించాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని, విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఇంత రాద్ధాంతం దేనికి చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారని వాపోయారు.
కోర్సు పూర్తి అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోర్టులు తీర్పులు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్రనే కాకుండా.. 23 వేల ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఉన్నతవిద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్, నాయకులు నీల వెంకటేష్, రాజేందర్ ముదిరాజ్, పగిళ్ల సతీశ్, ఆశిష్ గౌడ్, లింగయ్య యాదవ్, భీమ్ రాజ్, నిఖిల్ పటేల్, బారీ అశోక్, సిద్ధు యాదవ్, నరేశ్ గౌడ్, వంశీ పటేల్, కిరణ్, చిల్లర యశ్వంత్, గోపి, బలరాం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

