వెంగళరావునగర్, అక్టోబర్ 11 : బస్టాప్‌లో వేచి ఉన్న ప్రయాణికుడి సెల్ ఫోన్‌ను(Cell phone snatching) దొంగలు లాక్కుని పరారైన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..బి.కె.గూడకు చెందిన అవినాష్(30)సైట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 9వ తేదిన కొత్తగూడెం నుంచి బస్సులో వచ్చి..అమీర్‌పేట్(Ameerpet) మైత్రీవనం వద్ద బస్సు దిగారు.
తనను పికప్ చేసుకోవాల్సిందిగా స్నేహితుడు భరత్ కు ఫోన్ చేసి చెప్పాడు. అతని మిత్రుడి కోసం ఎదురు చూస్తుండగా..స్కూటీ పై వచ్చిన ఇద్దరు దొంగలు రోడ్డు పై నిలబడి ఉన్న అవినాష్ చేతిలోని ఫోన్ లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు బాధితుడు అవినాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దరాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | తెలంగాణకు నిధులు తేవడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం : హరీశ్ రావు
TG Rains | ఉపరితల ద్రోణి ప్రభావం.. మరో మూడురోజులు వానలే..!