బంజారాహిల్స్,ఏప్రిల్ 9 : నిషేధిత ఈ సిగరెట్లను విక్రయిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని వెస్ట్ ఎండ్ మాల్లో పనిచేస్తున్న శాంభవ్ జైన్(44) అనే వ్యక్తి గత కొంతకాలంగా నిషేధిత ఈ సిగరెట్లు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. సెల్లార్లో కస్టమర్లకు ఈ సిగరెట్లను విక్రయిస్తున్న శాంభవ్ జైన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు ఫ్లేవర్లకు చెందిన రూ.1.25లక్షల విలువైన ఈ -సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు శాంభవ్ జైన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Mumbai attack | అప్పుడు ఆ ఉగ్రవాదులిద్దరూ 231 సార్లు మాట్లాడుకున్నారట..!
Manchu Manoj | నా జుట్టు విష్ణు చేతుల్లోకి వెళ్లాలనే ఈ కుట్రలు : మంచు మనోజ్
China fighter jet | తోకలేని చైనా విమానం.. ఇంటర్నెట్లో వీడియో వైరల్