China fighter jet : చైనా కొత్తగా రూపొందించిన ఓ యుద్ధ విమానం వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ విమానానికి మూడు ఇంజిన్లు ఉండటంతోపాటు, తోకలేకపోవడం ప్రత్యేకత. పశ్చిమ దేశాలకు చెందిన నిపుణులు దానిని ఆరో తరానికి చెందిన జె-36గా అభివర్ణిస్తున్నారు. ఈ విమానం సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ రన్‌వేకు వెళ్లే క్రమంలో ఓ జాతీయ రహదారిపై అతి తక్కువ ఎత్తులో ప్రయాణించింది. దాన్ని కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ విమానంలో చైనా ఇంజినీర్లు అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని, ఏవియానిక్స్, పవర్‌ప్లాంట్, ఎయిర్ ఫ్రేమ్‌ను అమర్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రెండు ఎయిర్ ఇన్టేక్స్తో ట్రైజెట్ ఇంజిన్‌ను అమర్చారని చెబుతున్నారు. దీనిలో ఆయుధాలను అంతర్గతంగా భద్రపర్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వీటిల్లో దీర్ఘశ్రేణి క్షిపణులను కూడా అమర్చే అవకాశాలున్నట్లు అమెరికా సైనిక నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది చివర్లో తొలిసారి జె-36 ఫొటోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో మరోసారి బయటకు వచ్చాయి.
ప్రస్తుతం అమెరికా వద్ద ఐదో తరానికి చెందిన రెండు ఇంజిన్లతో పనిచేసే ఎఫ్-22, ఒక ఇంజిన్ అమర్చిన ఎఫ్-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిని అమెరికా పలు దాడుల్లో వినియోగించింది. చైనా వద్ద కూడా జె-20, జె-35 విమానాలు ఉన్నాయి. కానీ అవి ఇంతవరకు యుద్ధ రంగంలో అడుగుపెట్టలేదు. ఇక అమెరికా అత్యాధునిక యుద్ధవిమానం ఎఫ్-47 తయారీ కాంట్రాక్టును బోయింగ్ సంస్థకు అప్పగించింది.
🚀Flights of the Future: New Video of China’s Futuristic Fighter Jet Causes a Stir
New images have emerged of one of China’s futuristic fighter jets, a three-engine, tailless flying wing aircraft that Western analysts have dubbed the J-36.
🌐The fighter jet flies over a highway… pic.twitter.com/cNLOYjN6jc
— NEXTA (@nexta_tv) April 9, 2025