హైదరాబాద్ : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పుప్పాల గూడలో గుర్తు తెలియ దుండగులు యువకుడి గొంతులో ఇనుపరాడ్డు దించి క్రూరంగా హతమార్చారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు వివాహేతర సంబంధమా? ఆర్థిక లావాదేవీలు కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Ola-Uber | రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చు.. క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్
Mohanlal | వెండితెర అరంగేట్రం చేయబోతున్న మోహన్ లాల్ కూతురు.. దర్శకుడు ఎవరు అంటే..!
Gold Prices | మళ్లీ మెరిసిన బంగారం.. ఒక్కరోజే రూ.1,200దాకా పెరిగిన ధర