Ola-Uber | ఉబర్ (Uber), ఓలా (Ola) వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసుల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. మోటారు వాహన అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది.
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. క్యాబ్ అగ్రిగేటర్లు రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీ కంటే రెండు రెట్ల వరకు ధరను పెంచుకోవచ్చు. గతంలో ఇది 1.5 రెట్లుగా ఉండేది. ఇప్పుడు దాన్ని రెండు రెట్లకు పెంచారు. అలాగే విపరీతమైన రద్దీ ఉంటే సర్ ఛార్జ్‌ను 200 శాతం పెంచుకునే వీలు కల్పించింది. అయితే, మూడు కిలోమీటర్లలోపు ప్రయాణించే వారికి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని షరతు పెటింది. అంతేకాదు డ్రైవర్ కారణం లేకుండా రైడ్‌ను రద్దు చేస్తే రూ.100కు మించకుండా లేదా పది శాతం జరిమానా (ఏది తక్కువైతే అది) విధించవచ్చు. రైడ్ వాహనాలకు స్టేట్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించిన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా ఉండాలి.
Also Read..
PM Modi | విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని.. 8 రోజులపాటూ ఐదు దేశాల్లో పర్యటించనున్న మోదీ
India-US | త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. చాలా తక్కువ సుంకాలతోనే డీల్ ఉంటుందన్న ట్రంప్