PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఐదు దేశాల్లో (five nation tour) ఎనిమిది రోజుల పాటూ ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఘనా (Ghana)లో మోదీ పర్యటిస్తారు. ఇవాళ, రేపు ఆ దేశంలో ప్రధాని పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఘనా పర్యటనను ముగించుకొని ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగొల పర్యటకు వెళ్తారు. జులై 3, 4 తేదీల్లో అక్కడ పర్యటిస్తారు. ఆ తర్వాత జులై 4 అర్జెంటీనా వెళ్తారు. 5వ తేదీ వరకూ అక్కడ పర్యటిస్తారు.
ఆ తర్వాత జులై 5న బ్రెజిల్ వెళ్తారు. 8వ తేదీ వరకూ ఆ దేశంలోనే మోదీ పర్యటిస్తారు. రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సు (BRICS Summit)లో పాల్గొంటారు. ఈ పర్యటన తర్వాత 9వ తేదీన ప్రధాని నమీబియా వెళ్తారు. అక్కడ ద్వైపాక్షిక చర్చలు అనంతరం స్వదేశానికి తిరిగి వస్తారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2016లో ఆయన అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్గానిస్థాన్, ఖతార్‌లో ఒకేసారి పర్యటించారు.
Delhi | Prime Minister Narendra Modi embarks on a five-nation tour including Ghana, Trinidad and Tobago, Argentina, Brazil, and Namibia. PM Modi is also participating in the BRICS Summit in Brazil.
This will be PM Modi’s longest diplomatic visit in the last ten years; the… pic.twitter.com/HGtJWAZT6r
— ANI (@ANI) July 2, 2025
Also Read..
500 Percent tariff | రష్యాతో వ్యాపారం.. భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు..!
Amarnath Yatra | కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర