Pahalgam terror attack | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack)ని క్వాడ్ నేతలు (Quad leaders) తీవ్రంగా ఖండించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అమెరికాలో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్లు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం క్వాడ్ విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులు, వారికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్న వారిని వెంటనే శిక్షించాలని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలకు తమ సహకారం ఉంటుందని సంయుక్త ప్రకటనలో తెలిపారు. ‘పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన నేరస్థులు, వారిని ప్రోత్సహించిన వారికి వెంటనే శిక్ష పడాలి’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. బైసరాన్ వ్యాలీలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Amarnath Yatra | కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
కారులోంచి లాగి బాలికపై అత్యాచారం.. మహిళల నుంచి బంగారం దోపిడీ.. బీజేపీ పాలిత మహారాష్ట్రలో దారుణం
Madhya Pradesh | ఛాతిపై కూర్చొని.. గొంతు కోసి!.. దవాఖానలో యువతి దారుణ హత్య