Mohanlal | ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. ఎప్పటి నుండో ఈ సంప్రదాయం నడుస్తుంది. అయితే ఎక్కువగా సినీ ప్రముఖుల వారసులు ఎంట్రీ ఇస్తుండడం మనం చూస్తున్నాం. అయితే స్టార్ హీరోల తనయలు వెండితెర అరంగేట్రం చేయడం చాలా తక్కువ. ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ వారసురాలి ఎంట్రీ జరగబోతోంది. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్, త్వరలో నటిగా వెండితెరపై అరంగేట్రం చేయనుంది. విస్మయ ‘తుడక్కం’ అనే చిత్రంతో హీరోయిన్గా స్క్రీన్కు పరిచయం కాబోతోంది. ఈ చిత్రానికి జూడే ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు.
జూడే ఆంథనీ జోసెఫ్ గతంలో సారాస్, 2018 (Kerala Floods ఆధారంగా తెరకెక్కిన చిత్రం) వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ఈ ప్రాజెక్ట్‌ను మోహన్‌లాల్‌కు అత్యంత సన్నిహితుడైన ఆంటోనీ పెరుంబవూర్ తన ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “విస్మయ మోహన్‌లాల్‌ను వెండితెరకు పరిచయం చేయడం మా సంస్థకు గర్వకారణం” అని ఆశీర్వాద్ సినిమాస్ పేర్కొంది.
తన కుమార్తె తొలి సినిమా గురించి సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. “తుడక్కం సినిమా మీద నీ ప్రేమకు ఇది మొదటి అడుగు. నీ కొత్త ప్రయాణానికి నా తరఫున శుభాకాంక్షలు, విస్మయ” అంటూ మోహన్‌లాల్ ట్వీట్ చేశాడు. ఆయన అభిమానులూ ఈ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తూ విస్మయకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విస్మయ ఇప్పటికే రచయితగా తన ప్రతిభను చాటుకుంది. 2021లో ఆమె రచించిన ‘Grains of Stardust’ అనే పుస్తకం ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ అయిన Penguin Books ద్వారా విడుదలైంది. ఆమె రచనా శైలి విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. విస్మయ కేవలం సాహిత్యంలోనే కాదు, మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం సంపాదించింది. ఆమె థాయ్‌లాండ్‌లో శిక్షణ తీసుకొని ఫిజికల్ ఫిట్నెస్, యాక్షన్ ప్రిపరేషన్ లో ముందడుగు వేసింది. ఈ ప్రతిభను తెరమీద ఎలా చూపించబోతుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.