Jubilee hills By Poll | పటాన్ చెరు, అక్టోబర్ 21 : జూబ్లీహిల్స్లో జరుగనున్న ఉప ఎన్నిల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత తరపున ప్రచారంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి , పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 101వ డివిజన్ ఎర్రగడ్డ, 385 బూత్ పరిధిలో బూత్ ఇంచార్జిలు సత్యనారాయణ, సందీప్ గిరి గోస్వామి, ఐలాపూర్ మాణిక్ యాదవ్ MKY యువసేన సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. చేతకాని కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇక నుంచి ఫార్మాట్ ఏదైనా ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ 385 బూత్ ఇంచార్జీ లు సత్యనారాయణ, సందీప్ గిరిగో స్వామి , ఐలాపూర్ మాణిక్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ బండ్లగూడ టౌన్ ప్రెసిడెంట్ భరత్ కుమార్,అజ్జు అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!