KP Vivekanand Goud | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటల ముందు కల్కి సినిమా కూడా పనికి రాదు అని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి మార్పు అనే పిచ్చిలో పడిపోయాడు అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు.
త్రీడీ అద్దాలు లేకుండానే త్రీడీ మూవీ చూపిస్తున్నాడు.. న్యూయార్క్ సిటీ తల దాన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తా అన్నాడు.. న్యూయార్క్ సిటీ కట్టడానికి 200 ఏండ్లు పట్టింది. శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్ అంటాడు.. ఏం చేస్తాడు అక్కడ హబ్ కట్టి అని కేపీ నిలదీశాడు. రాచకొండలో ఫిల్మ్ ఇండస్ట్రీ కడతా అంటున్నడు.. సీఎం మాటలు ఎలా ఉన్నాయి అంటే ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఎక్కినట్టు ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.
గతంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నాలాల సమస్యను పరిష్కరించుకున్నాం. ట్రాఫిక్ సమస్య లేకుండా చేశాం. మున్సిపల్ శాఖను తన వద్ద ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. మార్పు అనే మాయలో పడి పరిపాలనను గాలికి వదిలేశాడు.రేవంత్ రెడ్డి మార్పు పిచ్చిలో పడి పేర్లు మారుస్తున్నాడు కానీ పని ఏం చేయాలో తెలియట్లేదు. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని గతంలో అసంపూర్తిగా ఉన్న పనులను ఎలా ముందుకు తీసుకు పోవాలి.. కొత్త పనులు ఏం చేపట్టాలి అనేది మర్చిపోయి మార్పు, మార్పు అనే దాన్ని పట్టుకుని పేర్లు మారుస్తున్నాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | రాజారాం యాదవ్ సహా విద్యార్థి నాయకుల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
Chalo Secretariat | సచివాలయాన్ని ముట్టడించిన బీసీ జనసభ కార్యకర్తలు.. రాజారాం యాదవ్ అరెస్ట్
Chalo Secretariat | నిరుద్యోగుల మార్చ్.. పోలీసుల గుప్పిట్లో సచివాలయం
KTR | ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కేటీఆర్