Jeevan Reddy | ఈ రాష్ట్రంలో ఏమవుతుందో ఎవరికైనా తెలుస్తుందా..? దొంగల రాజ్యం నడుస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఇవాళ ఓటుకు నోటుకు దొంగ రాజ్యమేలుతుండు..ఆయన సలహాదారు చంద్రబాబు నాయుడని.. ఆయన సలహాతోనే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి దొంగతనం చేశారని మండిపడ్డారు.
అప్పుడు కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు దెబ్బకు హైదరాబాద్ నుంచి పారిపోయిండు. అదొక్కటి మాత్రం మంచి పని అయింది. లేకపోతే హైదరాబాద్‌లో మాకు హక్కుందని ఇంకా నాలుగేళ్లు తిప్పల పెడుతుండే. ఈ ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే బయటపడ్డదో కేసీఆర్ నన్ను ఇక్కడ బతుకనిచ్చేటట్టు లేదురా అని మూట ముల్లె సర్దుకొని పోయిండన్నారు జీవన్ రెడ్డి.
ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి
కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు
మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే
– మాజీ మంత్రి జీవన్ రెడ్డి pic.twitter.com/3IZ6LQ4F9I
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Jailer 2 | జైలర్ 2’ రిలీజ్‌పై క్లారిటీ.. ఆ డేట్‌కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!
ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు
ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు తెలంగాణ ఆత్మ గౌరవం : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్