Hyderabad | హైదరాబాద్ : బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఐడీ నుంచి ఈమెయిల్ వచ్చిందని బుధవారం ఉదయం స్కూల్ వర్గాలు తెలిపాయి.
బాంబు బెదిరింపు ఈమెయిల్‌పై అప్రమత్తమైన స్కూల్ టీచర్లు పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఇక స్కూల్ వద్దకు చేరుకున్న ఆర్మీ అధికారులు, పోలీసులు, బాంబు స్క్వాడ్ కలిసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు, బాంబు స్క్వాడ్ నిర్ధారించారు. దీంతో టీచర్లు, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు బెదిరింపు మెయిల్ చేసిన వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కరెంట్ బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్మెన్పై దాడి
Hyderabad | గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి.. 9 మంది అరెస్ట్