హైదరాబాద్ : కరెంట్ బిల్లు(Electricity bill) చెల్లించాలని అడిగినందుకు లైన్మెన్పై ఓ వ్యక్తి నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మౌలాలి డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరెంట్ బిల్లు అడిగినందుకు సురేష్ అనే లైన్మెన్పై (Attacks lineman) ఇర్ఫాన్ అనే వ్యక్తి బూతులు తిడుతూ, సురేష్ బైక్‌ను ధ్వంసం చేశాడు. మర్యాదగా మట్లాడాలని లైన్మెన్ సూచించినా ఇర్ఫాన్ వినకుండా రుబాబుగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డాడు. విద్యుత్ అధికారుల ఫిర్యాదుతో మల్కాజ్గిరి పోలీసులు ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, లైన్మెన్పై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | భవిష్యత్‌లో త్రిష మరింత రాణించాలి.. ఎమ్మెల్సీ కవిత ఆకాంక్ష
Harish Rao | దేశానికి గర్వకారణమైన రోజు.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై హరీశ్‌రావు