హైదరాబాద్ : గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై(Brothel house) మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్‌టీఎఫ్ పోలీసులు(Police raid) దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..గౌలిదొడ్డి టీఎన్జీవోస్ కాలనీలో ఓ యువకుడు కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అదుకున్న ఎస్ఓటీ, హెచ్‌టీఎఫ్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడు ఒకరేనా లేదా ముఠాగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారా అనే కోణంలో సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
కొమురవెల్లిలో అఘోరి హల్చల్.. కత్తితో భక్తులపైకి దూసుకెళ్లి.. ద్వారాన్ని పగులగొట్టే యత్నం
Panchayat Elections | జూన్‌లోనే పంచాయతీ ఎన్నికలు.. డైలామాలో కాంగ్రెస్ సర్కార్!