RS Praveen kumar | కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి బీజేపీ వాళ్లు ఆ అమ్మాయి మేజరా.. మైనరా అనే చర్చ జరుపుతున్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా. క్విడ్ ప్రోకో కింద చెబుతున్నారని నా అనుమానం.. దయచేసి నన్ను క్షమించాలి. అమ్మాయిపై జరిగిన అత్యాచారం, పలు లొకేషన్లలో జరిగిన అఘాయిత్యాలు అనే దానిపై చర్చ జరగాలన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత విచ్చల విడిగా బాధ్యతారహితంగా అమ్మాయిలు లేకపోతే మహిళల పట్ల విచ్చలవిడిగా ప్రవర్తిసుంటే.. ఇంత బాధ్యతా రాహిత్యమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఆ అమ్మాయి మేజరా.. మైనరా అనే స్థాయికి దిగజారిందన్నారు. ఒకవేళ ఏదో ఒక టెస్టులో ఆ అమ్మాయి మేజర్ అని తేలుతది. అంటే అది అఘాయిత్యం కాదా..?అని ప్రశ్నించారు.
బాధితురాలు మేజర్ ఆ లేక మైనర్ ఆ అనే చర్చ జరగడం దురదృష్ట కరం
అంటే ఒకవేళ ఆ అమ్మాయి మేజర్ అని తెలితే అది అఘాయిత్యం కాదా?
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ pic.twitter.com/iRbWXWxyYu
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2026
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్