Bathukamma Kunta | అంబర్పేట బతుకమ్మ కుంట విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బతుకమ్మ కుంట హైడ్రా ఆధీనంలో ఉందన్న సంకేతాలు తీసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంటకు ఉన్న నేమ్ బోర్డ్స్ తీసివేశారు. గతంలో హైడ్రా ప్రభుత్వ భూమిగా గుర్తించి బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. చిల్డ్రన్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్తోపాటు అనేక ఏర్పాట్లు కూడా చేసింది. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేసింది. అయితే మొత్తం 7ఎకరాలకు సంబంధించి కుంట వివాదం కోర్టులో నడుస్తుంది.
కుంట తనదంటూ ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తి వాదిస్తున్నాడు. కోర్టులో వ్యవహారం ఉండగానే బతుకమ్మ కుంటను డెవలప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైడ్రా పేరును తీసేయాలి ఆదేశిస్తూ హైకోర్టు 3వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై హైడ్రా సుప్రీంకోర్టును ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట దగ్గర నేమ్ బోర్డ్స్, శిలాఫలకాలను తొలగిస్తున్నారు.
కాగా హైడ్రా పీఆర్ పిచ్చితో కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము వృథా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ కుంట భూమి వివాదం కోర్టులో ఉండగానే కోట్ల రూపాయల ఖర్చుతో సుందరీకరణ చేసి గ్రిల్స్, బోర్డులు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డితో అట్టహాసంగా ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బతుకమ్మ కుంట వద్ద బోర్డులను, శిలాఫలకాలను తొలగించిన హైడ్రా https://t.co/PjHEmmQgY0 pic.twitter.com/Dne1CF6tmA
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026

Free Petrol | ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే.. లీటర్ పెట్రోల్ ఫ్రీ.. దమ్మపేటలో వినూత్న ఆఫర్
Dhanush | యాత్ర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్ .. ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటంటే..!