Kajal Aggarwal | కాజల్ కొత్త మూవీ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్… రైతుల సమస్యలపై బలమైన సందేశం..
Kajal Aggarwal | సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ది ఇండియా స్టోరీ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించగా, చెట్టన్ డీకే దర్శకత్వం వహించారు.
Kajal Aggarwal | సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ది ఇండియా స్టోరీ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించగా, చెట్టన్ డీకే దర్శకత్వం వహించారు. జూలై 24న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం రైతులు వ్యవసాయంలో ఉపయోగించే పురుగుమందుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను కేంద్రంగా తీసుకుని రూపొందింది. ఈ రసాయనాల దుష్ప్రభావాల కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది ఎదుర్కొంటున్న సమస్యలను కథలో ప్రతిబింబించారు. వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ కథ ద్వారా సమాజంలో అవగాహన పెంచడమే చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక న్యాయవాది పాత్రలో కనిపించనుంది. కంపెనీల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బయటపెట్టే ధైర్యవంతమైన పాత్రను ఆమె పోషిస్తోంది. అలాగే శ్రేయస్ తల్పడే, మనీష్ వాధ్వా కీలక పాత్రల్లో నటిస్తూ కథను మరింత బలంగా తీసుకెళ్తున్నారు. వినోదంతో పాటు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో రూపొందిన ఈ చిత్రం, వ్యవసాయ రంగంలో జరుగుతున్న లోపాలు, వాటి ప్రభావాలను స్పష్టంగా చూపించే ప్రయత్నం చేసింది. బలమైన కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది.
మొత్తంగా చూస్తే, ‘ది ఇండియా స్టోరీ’ కేవలం ఒక సినిమా కాకుండా సమాజంలో చర్చకు దారితీసే అంశాలను తెరపైకి తీసుకువస్తున్న ప్రాజెక్ట్‌గా నిలవనుంది. జూలైలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి. కాగా, కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. పలు బిజినెస్‌లు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

