Free Petrol | రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ కొరత నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్టెల్ ప్రతినిధులు వినూత్న ఆఫర్ ఇచ్చారు. తమ దగ్గర సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఇస్తామని బంపరాఫర్ ప్రకటించారు
తెలుగు రాష్ట్రాల్లో కృత్రిమ ఇంధన కొరతతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తెరచివున్న బంక్‌ల వద్ద క్యూ కట్టి మరీ పెట్రోల్ పట్టించుకుంటున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఎయిర్టెల్ ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటూ.. మా దగ్గర సిమ్ తీసుకుంటే చాలు.. లీటర్ పెట్రల్ ఫ్రీగా ఇస్తామని బంపరాఫర్ ప్రకటించారు.
కొత్త కనెక్షన్ అయినా సరే.. లేదా వేరే నెట్వర్క్ నుంచి ఎయిర్‌టెల్‌కు మారినా సరే.. రూ.350 రీచార్జ్‌తో పాటు ఒక లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా ఇస్తున్నారు. కస్టమర్లను పెంచుకునేందుకు ఎయిర్టెల్ ప్రతినిధులు ఫాలో అవుతున్న ట్రిక్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో పెట్రోల్ కొరతను అదునుగా చేసుకుని వినూత్న ఆఫర్ ప్రకటించిన ఎయిర్టెల్ సిబ్బంది
ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అయి రూ.350తో రీచార్జ్ చేసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ అని ప్రకటించడంతో… pic.twitter.com/Ftw46ugkCn
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026