Cable Bridge | బీఆర్ఎస్ హయాంలో ఐటీ కారిడార్‌కు మణిహారంగా కేబుల్ బ్రిడ్జి.. ఇప్పుడేమో లైటింగ్‌లో ఘరానా మోసం
Cable Bridge | కేబుల్ బ్రిడ్జి అందంగా కనిపించేలా ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఎంతో ఖర్చు చేసి విదేశాల నుండి తెప్పించి ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని పట్టించుకోకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లారు.
Cable Bridge | కొండాపూర్, ఫిబ్రవరి 19 : ఐటీ కారిడార్‌కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మణిహారంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబుల్ బ్రిడ్జి లైటింగ్ కోసం విదేశాల నుంచి ఎల్ఈడీ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, సందర్శకులను ఆకట్టుకునేలా చేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య వైఖరితో కేబుల్ బ్రిడ్జి నిర్వహణను గాలికి వదిలేశారు.
కేబుల్ బ్రిడ్జి అందంగా కనిపించేలా ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఎంతో ఖర్చు చేసి విదేశాల నుండి తెప్పించి ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని పట్టించుకోకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో కేబుల్ బ్రిడ్జి గత కొద్దిరోజులుగా లైటింగ్ లేక అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే వాటి స్థానంలో అధికారులు ఫంక్షన్లలో ఉపయోగించే లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో కేబుల్ బ్రిడ్జి లైటింగ్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఇది ఆకర్షణీయమైన లైటింగ్ వ్యంస్థని కాదని, ఇదేమీ మోసం రా అంటూ ప్రభుత్వ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
లైటింగ్ నీ దొంగలెత్తుకెళ్లారు…
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి లైటింగ్ సిస్టమ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై విద్యుత్ శాఖ అధికారులను నమస్తే తెలంగాణ ప్రతినిధి వివరణ కోరగా… ఆశ్చర్య పోయే విషయాలు చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే కేబుల్ బ్రిడ్జి లైటింగ్ సిస్టమ్‌ను ఒకటి కాదు రెండు సార్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసినట్లు చెప్పడం గమనార్హం.
టెండర్ ప్రక్రియ జరిగింది… మరో 10 రోజుల్లో ఏర్పాటు : విజయ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
కేబుల్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్‌లో ఉపయోగించే లైట్లు జపాన్ నుంచి రావాలి. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. లైట్స్ విదేశాల నుంచి రావడానికి కొంచెం సమయం పడుతుంది. మరో పది రోజుల్లో వస్తాయి. ముందులాగా యధావిధిగా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. కేబుల్ బ్రిడ్జి బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉందో.. ఇప్పుడెలా ఉందో వివరిస్తూ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కేబుల్ బ్రిడ్జి లైటింగ్‌లో మోసం ఇలా..
Read Also :
Congress | కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నది : గండ్ర వెంకటరమణారెడ్డి
Afghanistan | ఎముకలు విరిగితేనే నేరమట.. గృహ హింసను చట్టబద్ధం చేసిన అఫ్గానిస్థాన్..!
‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

