Poor People | మా ఇండ్లు కూలిపోతే పట్టించుకునే నాధుడే లేడు.. భగత్ సింగ్ నగర్ బస్తీ మహిళలు
Poor People | హైదరాబాద్‌లోని భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు రోడ్డున పడ్డారు. రాత్రి వర్షం పడి కరెంట్ పోయింది.. నిద్రలేదు.. మా ఇండ్లు కూలిపోతే పట్టించుకునే నాధుడే లేడని ఓ మహిళ వాపోయింది.
Poor People | హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ – సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఉన్న భగత్ సింగ్ నగర్ బస్తీలో పేదల గుడిసెలు కూలిపోయాయి. నిలువ నీడలేక నిరాశ్రయులైన బాధితులు తమను ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ సర్కార్ కానీ , అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు
భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు రోడ్డున పడ్డారు. రాత్రి వర్షం పడి కరెంట్ పోయింది.. నిద్రలేదు.. మా ఇండ్లు కూలిపోతే పట్టించుకునే నాధుడే లేడని ఓ మహిళ వాపోయింది. ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చారు. పట్లాలిస్తం.. ఖాళీ చేయాలన్నరు.. కానీ ఇప్పటివరకు తమను పట్టించుకున్నవారే లేరని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రంతా తిండిలేక, నిద్రలేక, కరెంటు లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం.
రాత్రంతా వర్షానికి ఇంట్లోకి వచ్చిన నీళ్లు ఎత్తిపోసి ఓపిక లేకుండా పోయింది. మా పిల్లల ప్రాణాలు కాపాడుకోడానికే సరిపోయింది.. ఒక్క ప్రభుత్వ అధికారి కానీ నాయకులు కానీ మమ్మల్ని కాపాడడానికి రాలేదంటూ సదరు బాధిత మహిళ ఫైర్ అయింది.
మేము ఉన్నామని కూడా ప్రభుత్వానికి గుర్తులేదు. రాత్రి వర్షానికి గుడిసెలు కూలి రోడ్డున పడితే ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఒక్కరు కూడా వచ్చి చూడలేదని మరో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మా పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళండి అంటూ పేదలు మొరపెట్టుకుంటున్నారు. రాత్రి నుండి నడిరోడ్డుపై పడిగాపులు కాస్తున్నాం.. మేము బ్రతికున్నామా, సచ్చిపోయామా అని చూడడానికి కూడా ఒక్కరు రాలేదు. ఓట్ల కోసం అయితే ఇండ్ల చుట్టూ తిరుగుతారు కానీ ఇప్పుడు ఒక్క నాధుడు పట్టించుకోవడం లేదని మరో బాధిత మహిళ ఫైర్ అయింది.
రాత్రి వర్షం పడి మా ఇండ్లు కూలిపోతే పట్టించుకునే నాధుడే లేడు
రాత్రంతా తిండిలేక, నిద్రలేక, కరెంటు లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాము
రాత్రంతా వర్షానికి మా పిల్లల ప్రాణాలు కాపాడుకోడానికే సరిపోయింది.. ఒక్క ప్రభుత్వ అధికారి కానీ నాయకులు కానీ మమ్మల్ని కాపాడడానికి రాలేదు… pic.twitter.com/oe3H1exKEx
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2026
రాత్రి నుండి నడిరోడ్డుపై పడిగాపులు కాస్తున్నాం
మేము బ్రతికున్నామా, సచ్చిపోయామా అని చూడడానికి కూడా ఒక్కరు రాలేదు
ఓట్ల కోసం అయితే ఇండ్ల చుట్టూ తిరుగుతారు కానీ ఇప్పుడు ఒక్క నాధుడు పట్టించుకోవడం లేదు
హైదరాబాద్ – సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఉన్న భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి… https://t.co/JHBcKVnrKM pic.twitter.com/N3TE7EyJWT
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2026
Read Also :
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

