బేగంపేట్ ఆగస్టు 1: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో ఆషాడ బోనాల జాతర ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి హుండీని అధికారులు లెక్కించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ హుండీ లెక్కింపులో అమ్మవారి హుండీ ఆదాయం రూ. 58,84,066, కాయిన్స్, 3,36,816, అలాగే అమెరికా డాలర్స్ 320, కెనడా డాలర్స్, 5, కలిపి మొత్తంగా హుండీ ఆదాయం 62, 44,500 ఆదాయం లభించినట్టు ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఫెస్టివల్ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు.
MCA | మ్యూజియంలో గవాస్కర్, పవార్ల నిలువెత్తు విగ్రహాలు.. ఎందుకో తెలుసా..?
Woman Married 8 Men | 8 మందిని పెళ్లాడి దోచుకున్న మహిళ.. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా అరెస్ట్