శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 01:48:51

వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకాలు

 వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకాలు

మేడ్చల్‌  : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో తాత్కాలిక పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 29 పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని,  అర్హులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అభ్యర్థులు తమతమ దరఖాస్తులను  akvenu. gopal10 @gmail.comకు గానీ, లేదా 21వ తేదీ వరకు ఎస్‌ఏ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అందేలా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

 అభ్యర్థి వయస్సు 2020 ఏప్రిల్‌ 1 నాటికి 18 నుంచి 34 ఏండ్లలోపు ఉండాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.17,500 జీతం ఉంటుందని, మెరిట్‌, రోస్టర్‌ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని నోటీసు బోర్డులో ఈ నెల 23న ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9848563854, 89773366 11 నంబర్లకు కార్యాలయ పనివేళలలో ఫోన్‌చేయాలని సూచించారు.


logo