పుతిన్‌కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మంగళవారం కరోనా వైరస్ టీకాలు వేశారు. అయితే ఈ సమయంలో వీడియో లేదా ఫొటోలను అక్కడి ప్రభుత్వం విడుదల చేయలేదు.

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మంగళవారం కరోనా వైరస్ టీకాలు వేశారు. అయితే ఈ సమయంలో వీడియో లేదా ఫొటోలను అక్కడి ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రభుత్వం కేవలం ఒక ప్రకటన విడుదల చేసి పుతిన్ వ్యాక్సిన్ తీసుకున్నారు అని సమాచారం ఇచ్చింది. ఇంతకు ఆయనకు ఏ టీకా వేశారు. రష్యా ప్రభుత్వం అనుమతించిందేనా? ఏ కంపెనీ తయారుచేసింది పుతిన్‌కు వేశారు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
‘టీకా తీసుకున్న తరువాత అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉన్నది. టీకా తర్వాత రోజంతా అలసట లేకుండా పని చేశారు. పుతిన్‌కు నచ్చనందున టీకా తీసుకుంటున్న ఫొటో లేదా వీడియో విడుదల చేయలేదు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.
కెమెరా ముందు వ్యాక్సిన్ తీసుకోవడానికి అధ్యక్షుడు అనుమతించలేదని, ఇలా ఫొటోలకు ఫోజులివ్వడం ఆయనకు నచ్చదని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పెస్కోవ్ చెప్పారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా అధ్యక్షుడు పుతిన్.. రష్యా ప్రజలకు మంచి ఉదాహరణగా నిలిచారన్నారు. మూడు వారాల తరువాత ఆయనకు రెండవ మోతాదు వ్యాక్సిన్ ఇస్తామని పెస్కోవ్ చెప్పారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో రష్యా ప్రజల డిమాండ్‌ను తీర్చడానికి తగిన వ్యాక్సిన్ లేదని, అయితే ఇప్పుడు ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని ఆయన వెల్లడించారు. రష్యాలో వ్యాక్సిన్ డిమాండ్ నిరంతరం పెరుగుతున్నదని ఆయన అన్నారు. అధ్యక్షుడికి టీకాలు వేసిన తరువాత వ్యాక్సిన్లకు డిమాండ్ మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నట్లు పెస్కోవ్ పేర్కొన్నారు.
టీకాలు తీసుకోవాలనుకునే నిర్ణయం పూర్తిగా రష్యన్ ప్రజలకు స్వచ్ఛందంగా ఉన్నదని పుతిన్ సోమవారం తెలిపారు. ఇప్పటివరకు రష్యాలో 4.3 మిలియన్ ప్రజలకు రెండు మోతాదుల టీకా ఇచ్చారు. రష్యాలో జనాభా 144 మిలియన్లు. రష్యాలో కరోనా అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ. అలాగే, ఎపివాకోరోనా, కోవివాక్ అనే మరో రెండు వ్యాక్సిన్లకు పుతిన్ ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
రైల్వే ప్లాట్‌ఫాంపై ఏనుగు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Covid vaccine
- Putin
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

