e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!

ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!

ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!

న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఈ నెలలో కొత్త రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ సేకరణ ఈ నెలలో రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అందులోనూ ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో జీఎస్టీ వసూళ్లు పెరుగనున్నాయి.

2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. 2017 జూలై -2018 మార్చి మధ్య మొత్తం వసూళ్లు రూ.7.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2018 ఏప్రిల్-2019 మార్చి మధ్య వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది 2019 ఏప్రిల్-2020 మార్చి మధ్య రూ.12.22 లక్షల కోట్లు. 2020 ఏప్రిల్-2021 ఫిబ్రవరి మధ్య రూ.10.22 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయి.

- Advertisement -

జీఎస్టీ వసూలు గత 5 నెలలుగా నిరంతరం రూ.1 లక్ష కోట్లకు పైగా ఉన్నది. 2021 జనవరిలో అత్యధిక వసూళ్లు జరిగాయి. ఈ నెలలో రూ.1,19,847 కోట్లు వసూలు చేశారు. గత 6 నెలల్లో కరోనా సమయంలో జీఎస్టీ బృందం, ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ జీఎస్టీ దొంగతనాలను నిరోధించాయని నిపుణులు అంటున్నారు. జీఎస్టీ వసూళ్లు పెరుగడానికి ఇదే కారణం అని నిపుణులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ మోసాలు జరిగాయి.

గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా తీవ్రంగా దాడులు జరుపడంతో.. నకిలీ కంపెనీలు, బిల్లులు పట్టుబడ్డాయి. ఈ కంపెనీలు నకిలీ ఇన్‌పుట్‌ల ద్వారా క్రెడిట్ తీసుకునేవి. ఇలాంటి మోసాలను నివారించడానికి జీఎస్టీ బృందం తన ఐటీ వ్యవస్థను బలోపేతం చేసింది. ఇది కాకుండా, దాని బృంద సభ్యులు ప్రతి రాష్ట్రంలోని పెద్ద ఎత్తున కంపెనీలను పరిశీలిస్తున్నారు. ఇటీవల జీఎస్టీ సేకరణలో తగ్గుదల కనిపించినప్పుడు.. ఏటా రూ.50 లక్షల టర్నోవర్‌ ఉన్నవారిని జీఎస్టీ అధికారులు పిలిపించి వ్యక్తిగతంగా ప్రశ్నించారు. దాంతో అసలు విషయాలు బయటపడ్డాయి.

2017 లో జీఎస్టీ అమలు చేసినప్పటి నుంచి వసూళ్లు వరుసగా 5 నెలలు రూ.1 లక్ష కోట్లకు పైగా ఉండటం ఇదే మొదటిసారి. అలాగే, ఏ నెలలోనైనా అత్యధిక సేకరణ ఈ ఏడాది జనవరిలోనే ఉన్నది. జీఎస్టీ వసూళ్లు అక్టోబర్‌లో రూ.1.05 లక్షల కోట్లు, నవంబర్‌లో రూ.1.04 లక్షల కోట్లు, డిసెంబర్‌లో రూ.1.15, జనవరిలో రూ.1.19, ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి. మార్చిలో ఇప్పటివరకు ఈ సంఖ్య రూ.1.25 లక్షల కోట్లుగా తేలింది. మరో వారం రోజుల్లో ముగిసే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ఎక్కువ వసూళ్లు చేసి కొత్త రికార్డు సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో అధికారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్‌ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!

ట్రెండింగ్‌

Advertisement