సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 16, 2020 , 09:00:05

శిక్షణ శిబిరానికి దరఖాస్తుల ఆహ్వానం

శిక్షణ శిబిరానికి దరఖాస్తుల ఆహ్వానం

తెలుగుయూనివర్సిటీ: అన్నమయ్య, రామదాసు కీర్తనలతో పాటు ఇతర వాగ్గేయకారులు రచించిన సంకీర్తనలలో శిక్షణతో పాటు దేశభక్తి గీతాలు, కీబోర్డు తదితర అంశాలలో శిక్షణ  ఇవ్వనున్నట్లు ప్రఖ్యాత గాయకులు, సంగీత కళా రత్న అవార్డుగ్రహీత యరగొల్ల శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ సమ్మర్‌ క్యాంపులో సంగీతం పట్ల అవగాహన, సంకీర్తనల వల్ల కలిగే మరెన్నో ప్రయోజనాలను వివరించి నేటి యువతలో దేశభక్తి స్ఫూర్తి నింపడం తద్వారా భారతీయ సంస్కృతి, కళల పట్ల అవగాహన పెంచడమే ఉద్దేశ్యంగా ఈ శిక్షణా తరగతులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  సంగీతం, కళల్లో ప్రావీణ్యం సంపాదించాలనుకునే జంటనగరాల బాల, బాలికలతో పాటు వయసుతో నిమిత్తం  లేకుండా అన్ని వయసుల వారికి సంగీతం తదితర అంశాలలో శిక్షణ ఇచ్చి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే సంకల్పంతో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు శ్రీనివాస్‌ వెల్లడించారు. నామమాత్రం ఫీజుతో ఈ శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల వారు 9849053159 నెంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.logo