Ailapur Victims | రేవంత్ సర్కార్ దౌర్జన్యకాండపై ఐలాపూర్ హైడ్రా కూల్చివేత బాధితురాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బుల్డోజర్లతో నిలువ నీడ లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
ఐలాపూర్ హైడ్రా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇంటి ట్యాక్స్ ఉంది.. కరెంట్ బిల్ ఉంది.. బోర్ ఉంది.. స్తంబాలున్నాయి. 50 ఏండ్ల నుంచి పంట పెడుతున్నం. మా నాయన, తాత, తాత వాళ్ల నాయన పంట పెట్టిండు. ఇప్పుడొచ్చి మీరు ఖాళీ చేయండి అంటే ఎక్కడ పోవాలే.. ఎక్కడ చావాలే. నా ఆరోగ్యం కూడా బాగా లేదు. నేను డయాలసిస్ పేషంట్‌ను.. మా తమ్ముడు సమస్యలో ఉన్నడన్నాడు.
ఎండాకాలం కాబట్టి బోర్లు నీళ్లు పోయడం లేదు. పంట పెట్టడం లేదు. ప్రతీ వానకాలం, ఎండాకాలం అన్ని పంటలు వేస్తం. ఇప్పుడు ఎక్కడ పోవాలే.. ఏదో ఒక చెట్టు చూసుకుని చెట్టు కిందుండాలే. మీ వీడియో వాళ్లంతా సహకరించి మమ్మల్ని రేవంత్ రెడ్డి ఇంట్ల ఉంచితే బాగుంటది. అందరి ఉసురు పోసుకోవడం కరెక్ట్ కాదు కదా. మా ఇల్లు పట్టా ఉంది. కరెంట్ బిల్లు ఉంది. బోర్లున్నాయి.. ట్రాన్స్ఫార్మర్ ఉంది. మాకు ఏం లేదు. ఎట్లా వచ్చి కబ్జా పెట్టినం. మాకు ఏం లేదని ఖాళీ చేపిస్తం. మా ఉసురు ముట్టి పోతవ్. కేసీఆర్ ఉన్నప్పుడు మా దగ్గరకు రాలేదు. ఈయన వచ్చినంకనే ఊరి మీద పడి తినేస్తున్నడని వాపోయారు.
మా తాతల కాలం నుండి ఇక్కడ ఉన్నాము.. ఇప్పుడు వచ్చి ఖాళీ చేయండి అంటే మేము ఎక్కడ చావాలి
మమ్మల్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా పెట్టండి
మా పేదోళ్ల ఇంటి మీద పడితే నీకు ఏమొస్తుంది – ఐలాపూర్ హైడ్రా బాధితులు https://t.co/XLB4amBpVb pic.twitter.com/UjKbRaJY5I
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2026
Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!