Bribe | ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ డివిజన్ సిటీ రేంజ్-2 యూనిట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాకొండ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయిపోయాడు.
ఓయూ క్యాంపస్ పరిధిలో ఉన్న మానేరు బాయ్స్ హాస్టల్ పునరుద్దరణ పనులకు సంబంధించిన బిల్లులు రూ.7,37, 034 విడుదల చేయడంతోపాటు, భవిష్యత్‌లో తమ కాంట్రాక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఇంజినీర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారుడిని రూ.11 వేలు డిమాండ్ చేశాడు. ముందుగా ఫోన్ పే ద్వారా రూ.5 వేలు లంచాన్ని తీసుకున్న శ్రీవివాసులు రెండోసారి మిగిలిన రూ.6 వేలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
శ్రీనివాసులును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి స్పెషల్ జడ్జ్ (ఏసీబీ కేసులు) ఎదుట హాజరుపరిచారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని.. లేదంటే ఏసీబీ తెలంగాణ వాట్సాప్ నంబర్ (9440446106)కు సమాచారమందించాలని.. బాధితులు/ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఏసీబీ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.
Maoists | సిర్పూర్ అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల స్థావరం.. 16 మంది అరెస్ట్
Thungathurthi : ఘనంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ జన్మదిన వేడుకలు