తుంగతుర్తి, డిసెంబర్ 16 : తుంగతుర్తి మండల కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తుంగతుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో నూతన సర్పంచులుగా ఎన్నికైన మాతంగి వెంకటమ్మ, చింతకుంట్ల మనోజ్, తప్పేట్ల యల్లయ్య, మేడదుల రమేశ్‌కు పార్టీ కార్యాలయంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండగాని రాములుగౌడ్, దొంగరి శ్రీనివాస్, గోపగాని శ్రీనివాస్, రమేశ్, వెంకటేశ్, వెంకన్న, సోమన్న, సురేశ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.

Thungathurthi : ఘనంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ జన్మదిన వేడుకలు