సిటీబ్యూరో, జనవరి 6 ( నమస్తే తెలంగాణ ) : ఫరెవర్ మిసెస్ ఇండియా తెలంగాణ విజేతగా ఆది రమాదేవి (Aadi Ramadevi) నిలిచారు. జైపూర్లో జరిగిన ఫరెవర్ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఆమె సత్తా చాటారు. ఈ టైటిల్ కోసం అనేక మంది పోటీపడ్డారు. తన టాలెంట్ ప్రదర్శించి.. సామాజిక అంశాలపై ఆమె అభిప్రాయాలను వెల్లడించి టైటిల్ విజేతగా(Forever Mrs. India Telangana) నిలిచింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నటన, మోడలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. తాను ఒక జంతు ప్రేమికురాలని తెలిపారు. సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే విజయాలు వరిస్తాయని వివరించారు. తాజా డిజైన్లను ప్రదర్శిస్తూ మోడలింగ్ ప్రతిభను ప్రదర్శించిన ఆమె అంతర్జాతీయ ఖ్యాతిగల పీలోబో ఫ్యాషన్ మిసెస్ ఇండియా 2024 పోటీకి నృత్య దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూలో ఆంధ్రా వ్యక్తులకు పెద్ద పీట.. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
SRDP | ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎస్ఆర్డీపీ ఫలమిదీ..
Liquor bottles | హైదరాబాద్లో భారీగా అక్రమ మద్యం సీజ్..