Aurore Pharmaceuticals | మేడ్చల్ మల్కాజ్గిరి : సూరారంలోని అరోరా ఫార్మా కంపెనీలో బుధవారం ఉదయం ప్రమాదం సంభవించింది. ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తుండగా.. కార్మికుడు అనిల్(43) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఫార్మా సిబ్బంది.. గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఫార్మా కంపెనీ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Lagacherla | రాష్ట్రపతి భవన్కు చేరిన లగచర్ల బాధితుల గోడు.. ద్రౌపది ముర్ముకు లేఖ
KTR | ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు..! హిమాచల్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ట్వీట్