Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై ఓ యువతి మత్తులో నగ్నంగా పడింది. స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అపస్మారకస్థితిలో ఉన్న యువతిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే యువతిపై అత్యాచారం చేసి రోడ్డుపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి వయసు 30 ఏండ్లు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jagityala | జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో వన్య ప్రాణుల మాంసంతో అధికారుల దావత్ ?
Harish Rao | అందరూ దుర్గామాత ఆశీస్సులు పొందాలి.. దసరా శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు
KTR | ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.. కేటీఆర్ ట్వీట్