Harish Rao : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతిరూపమని.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని బీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు హరీశ్‌రావు అన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
అదేవిధంగా ఆ పోస్టులో “శమీ శమయతే పాపం, శమీశతృ వినాశనీ | అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ || అనే దసరా ప్రత్యేక శ్లోకాన్ని కూడా ప్రస్తావించారు. ఈ పోస్టుకు సింహంపై ఆసీనురాలై ఉన్న దుర్గామాత, పాలపిట్ట, జమ్మిచెట్టు ఫొటోలను ఆయన జత చేశారు. అజ్జాతవాసం అనంతరం జమ్మిచెట్టుపై దాచిఉంచిన ఆయుధాలను తీసుకెళ్లే పాండవులు విజయం సాధించారని, విజయదశమి నాడు పాలపిట్టను చూసి వెళ్లే రావణుడిపై రాముడు విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి.
“శమీ శమయతే పాపం, శమీశతృ వినాశనీ |
అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ ||తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.#HappyDusshera pic.twitter.com/vc29ZUlBOI
— Harish Rao Thanneeru (@BRSHarish) October 12, 2024