జగిత్యాల : జగిత్యాల(Jagityala) ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారులు చేసుకున్న పార్టీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వన్య ప్రాణి మాంసంతో(Wld animal meat) ఫారెస్ట్ ఆఫీసర్లు(Forest Officers) దసరా దావత్ చేసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దావత్ కు జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు హాజరైనట్లు తెలిసింది. నెమలి, అడవి పంది మాంసంతో పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఇదేంటని ప్రశ్నించిన మీడియా పై అధికారులు దురుసుగా ప్రవర్తించారు.
మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ విషయంపై జిల్లా అటవీ శాఖ అధికారిని సంప్రదిస్తే తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారుల లిక్కర్ దావత్
వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానాలు.
నెమలి, అడవి పంది మాంసంగా అనుమానాలు, మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం.
దావత్ కు హాజరైన జిల్లా ఫారెస్ట్… pic.twitter.com/VSWGn3izDU
— Telugu Scribe (@TeluguScribe) October 12, 2024