Hyderabad | హైదరాబాద్ : గాజుల రామారం పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ సెక్యూరిటీగార్డును అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు గాల్లోకి ఎగిరిపడ్డాడు. కారు ముందు భాగం కూడా తీవ్రంగా ధ్వంసమైంది. కారు వేగంగా దూసుకురావడంతో రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. ఓ కంపౌండ్ వాల్ కూడా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని సెక్యూరిటీగార్డ్ గోపీ(38)గా పోలీసులు నిర్ధారించారు. అయితే కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
సీసీటీవీ ఫుటేజ్.. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.
హైదరాబాద్ – గాజుల రామారంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డ్ గోపి(38)ని అతివేగంతో ఢీకొట్టిన కారు.
ప్రమాదంలో గోపి అక్కడికక్కడే మృతి.. మద్యం మత్తు కారు డ్రైవ్ చేసినందుకే ప్రమాదం జరిగినట్లు… pic.twitter.com/GdA6qrpshT
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2024
ఇవి కూడా చదవండి..
Tungabhadra Dam | వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్.. వీడియో
Hindenburg Report | హిండెన్‌బర్గ్ నివేదికపై జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు
Home Minister Anitha | ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన పెను ప్రమాదం