Charminar | హైదరాబాద్ : క్షణాల్లో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా వినూత్న స్టంట్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకునేందుకు కూడా చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. అలానే ఓ వ్యక్తి తన ప్రాణాలను లెక్క చేయకుండా.. సాహసం చేశాడు.
హైదరాబాద్ నగరంలో ఉన్న చార్మినార్‌పైకి ఓ వ్యక్తి ఎక్కాడు. చార్మినార్ చివరి అంతస్తులో నిలబడి.. ప్రమాదకరమైన స్టంట్‌కు పాల్పడ్డాడు. ఒక కిటికీ నుంచి మరో కిటికీని పట్టుకొని ప్రమాదకరంగా నడిచాడు. ప్రమాదకరంగా రెండు కిటీకీలను దాటుకుని తీరిగ్గా అక్కడే సెటిలయ్యాడు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అసలు ఆ వ్యక్తి చార్మినార్ పైకి ఎందుకు వెళ్లాడు? చివరి అంతస్తు వరకు వెళ్లేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు..? అలా ప్రమాదకరంగా నడవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇలా రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ప్రమాదకరంగా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అక్కడికి తరలివెళ్లే కార్మికుల్లో ఒకరు అలా వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చార్మినార్‌పై ప్రమాదకరంగా నడిచిన వ్యక్తి
చార్మినార్‌పై ఒక కిటికీ నుంచి మరో కిటికీని పట్టుకొని ప్రమాదకరంగా నడిచిన వ్యక్తి.
నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల్లో ఒకరై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు. pic.twitter.com/61vfUQnCBd
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2024
ఇవి కూడా చదవండి..
Hyderabad | బాలిక న్యూడ్ వీడియో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామాంధుడు
Osmania University | ఓయూకు ఏమైంది?.. అధికారుల వైఖరితో దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట!
Govt Hospitals | ఇది మీ జిల్లా కాదు.. ఇక్కడ మీకు కాన్పు చేయం.. రేవంత్ పాలన ఇదీ..