Kidnap Case | కొండాపూర్, మే 6 : గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఓ వ్యక్తి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. బుధవారం స్థానికంగా ప్లాట్ నెంబర్ 223/135లో గత 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గెల్వయ్యను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి, బలవంతంగా కారులో కిడ్నాప్ చేసినట్లు గెల్వయ్య తల్లితోపాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సదరు ప్లాట్ యజమానులు గత 35 సంవత్సరాలుగా అక్కడికి రాలేదని, గెల్వయ్య తన తల్లితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
అంజయ్య నగర్లో ప్లాట్ ధరలు పెద్ద మొత్తంలో ఉండటం, అధిక మొత్తంలో అద్దెలు వస్తుండటంతో కొంత మంది మధ్యవర్తులు గెల్వయ్యను భయపెట్టి, అక్కడి నుంచి తరిమేసి సదరు ప్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నంలో భాగంగానే కిడ్నాప్ చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. కాగా కిడ్నాప్ కలకలంపై స్థానిక రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు స్థానికులు చేసిన ప్రయత్నానికి స్పందన లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెల్వయ్య తల్లి స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కిడ్నాప్ చేశారిలా..