హైదరాబాద్ : కంసన్ హైజెన్ కేర్(Kansan haizen care industry) పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం(Fire accident )చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెన్ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షెడ్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్కువ భాగం దెబ్బతినగా.. రాత్రి సమయం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.