Hyderabad | ఖైరతాబాద్, ఫిబ్రవరి 8 : ఆస్తి కోసం కన్న కొడుకు, కోడలు వేధింపులకు పాల్పడుతున్నారని ఓ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హయాత్‌నగర్‌కు చెందిన బలరాం, మంగమ్మ దంపతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానమని, వారందరికీ పెళ్లిళ్లు చేసి ఆస్తులు సమానంగా పంచామన్నారు. తమ పేరిట హయాత్‌నగర్‌లో 300 గజాల స్థలంలో భవనం ఉందని, దానిపై కన్నేసిన తమ పెద్దకొడుకు, కోడలు తరచూ వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వారి బాధలు తాళలేక సొంత ఇంటిని వదిలి కిరాయి ఇంట్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. వారితో తమకు ప్రాణ హానీ ఉందని, ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు రక్షణ కల్పించాలని వృద్ధ దంపతులు వేడుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ‘మా కాలనీలో హాస్టళ్లను అనుమతించం’.. చర్చనీయాంశంగా మారిన బ్యానర్లు
Murder | తాతను చంపిన మనమడు దొరికాడు.. ఎందుకు హత్య చేశాడో తెలుసా..?
Hyderabad | అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయి పట్టివేత.. మహిళతో పాటు ఇద్దరు అరెస్టు