హైదరాబాద్ : రాజేంద్రనగర్(Rajendranagar) వద్ద గల ఓఆర్ఆర్(ORR)పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైద్యుడు మృతి(Doctor died) చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో వాహనం కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో నేత్ర వైద్యుడిగా పనిచేస్తున్న నిలయ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అదుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.