Daughter | ప్రియుడు మోజులో పడి కండ్లు మూసుకుపోయిన ఓ కూతురుకు తల్లి తనను నవమాసాలు మోసి కని పెంచిన విషయం మరిచిపోయింది. కన్నప్రేమను మర్చిపోయి.. కని పెంచిన తల్లిని కూతురే కాలయముడిలా మారి చంపేసింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ శివార్లలో ఉన్న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకుర్ భరత్ నగర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 2025 మే నెలలో అంజు (40) అనే మహిళ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీనిపై జవహర్ నగర్, బొల్లారం పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తన తల్లి మంజు కనిపించడంలేదని, ఆమె బైక్ కూడా కనిపించడం లేదని ఆమె పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారించినా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మంజు ఆచూకీ కనుక్కోలేకపోయారు. దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు మిస్టరీగా మారింది.
అయితే ఇటీవల మృతురాలి బైకును మౌంటీ రాజ్‌పుత్ అనే వ్యక్తి రాంకోఠిలోని ఒక షాపులో అమ్మేందుకు వెళ్లాడు. మౌంటీ రాజ్‌పుత్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మౌంటీ రాజ్‌పుత్‌ను అదుపులోకి విచారించగా, మంజు చిన్న కూతురు ఇషికా, తాను ఇద్దరం ప్రేమించుకున్నామని, తమ ప్రేమకు ఒప్పుకోనందుకే మంజును హత్య చేశామని తెలిపాడు.
చిన్న కూతురు ఇషికా తన తల్లిని హత్య చేసి, ఏడాదిగా ఏమీ తెలియనట్లు నటించిందని, చివరికి బైక్ నిందితులను పట్టించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏడాది తర్వాత ఈ దారుణ ఉదంతం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూతురే కన్నతల్లిని హతమార్చడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసే ప్రక్రియను చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.
Talasani Srinivas Yadav | నగరంలో ఒక్క ఇంటినైనా నిర్మించారా ? అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీసిన తలసాని
Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత అవాస్తవం : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Oka Roju | జపాన్ మంచులో సాయిపల్లవి ప్రేమకథ.. తెలుగులో ‘ఒక రోజు’గా ఏక్ దిన్!