Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చంపాపేట్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసులపై దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మీర్‌చౌక్ పోలీసులు శనివారం రాత్రి చంపాపేట్‌లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి స్కూటర్‌పై వస్తుండగా అతన్ని ఆపి డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. దీంతో ఆ వ్యక్తి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. ఇక అతని బైక్‌ను సీజ్ చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆగ్రహాంతో ఊగిపోయాడు. తన బైక్‌నే సీజ్ చేస్తారా అంటూ హంగామా సృష్టించాడు. రాళ్లతో పోలీసులపై దాడి చేసేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా బైక్‌కు నిప్పంటించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Traffic Rules | నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు
Actor Ali | సినీనటుడు అలీ నిర్మాణాలకు నోటీసులు
Kokapet Lands | కోకాపేట్ భూములను ఏం చేద్దాం? మిగులు 24 ఎకరాలపై తర్జన భర్జన?