Actor Ali | నవాబుపేట, నవంబర్ 23 : సినీ నటుడు మహ్మద్ అలీ అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉన్నది.
దానిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఏక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు అందజేశారు. ఆ నోటీసులో పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని రాశారు. అక్రమ నిర్మాణాలకు ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా, ఈ నెల 22న మరో నోటీసు అందజేశారు. ఆ ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి నోటీసులు అందించామని ఆమె చెప్పారు.