e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో 5,858 మందిపై కేసులు

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో 5,858 మందిపై కేసులు

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో 5,858 మందిపై కేసులు

హైదరాబాద్‌ : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను జప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇవాళ లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన 5858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 4664 వాహనాలను జప్తు చేశారు. అదేవిధంగా మాస్కులు ధరించని/ పాక్షికంగా ధరించిన 1752 మందిపై కేసులు పెట్టారు. భౌతికదూరం పాటించని 391 మందిపై, గుంపులుగా తిరుగుతున్న 72 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుట్కా, పాన్‌ మసాలా తీసుకుంటున్న 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు కమిషరేట్‌ కార్యాలయం అధికారులు వెల్లడించారు. మొత్తంగా 8,094 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో 5,858 మందిపై కేసులు

ట్రెండింగ్‌

Advertisement