అకాల వర్షం..అతలాకుతలం
గాలిదుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు కురిశాయి. పిడుగుల వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరి పడ్డాయి.
- ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల వర్షం
- విరిగిన చెట్లు, కూలిన విద్యుత్ స్తంభాలు
- నేలరాలిన మామిడి కాయలు, నిమ్మకాయలు
- పిడుగుపాటుకు ఒకరు దుర్మరణం.. ఎనిమిది పశువులు మృతి
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- వర్షానికి చల్లబడిన వాతావరణం
నల్లగొండ/చిట్యాల/శాలిగౌరారం/మర్రిగూడ/ఆత్మకూర్.ఎస్. తిరుమలగిరి /బొడ్రాయిబజార్/ నాగారం మే 5 : గాలిదుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు కురిశాయి. పిడుగుల వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరి పడ్డాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తోటల్లో మామిడి కాయలు, నిమ్మకాయలు కింద రాలాయి. పిడుగుపాటుకు ఒక వ్యకి చనిపోయాడు. ఎనిమిది పశువులు మృత్యువాత పడ్డాయి.

తాటి, కొబ్బరి చెట్లపై పిడుగులు పడి మంటలు చెలరేగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈ వర్షం ప్రజలతోపాటు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అడ్డగూడూరు మండలం కోటమర్తిలో పిడుగుపాటు వ్యక్తి చనిపోయాడు. ఒక బర్రె మృతి చెందింది. గుండాల మండలం తుర్కలషాపురం ఒక బర్రె, వలిగొండ మండలం వెంకటాపురంలో ఒక ఆవు, సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో రెండు ఆవులు, ఆత్మకూర్.ఎం మండలం పారుపల్లిలో ఒక ఎద్దు, చండూరు మండలం ఉడుతపల్లిలో ఆవు పిడుగుపాటుకు మృతిచెందాయి. వర్షంతో వాతావరణం చల్లబడగా ఎండ వేడిమి నుంచి జనం ఉపశమనం పొందారు.
5 గంటలు నిలిచిన కరెంట్ సరఫరా

నల్లగొండ సిటీ, మే 5 : ఈదురు గాలుల వర్షానికి నల్లగొండ పట్టణంలో సుమారు 5 గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 : 30 గంటల వరకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్లను తొలగించక పోవడం తో ఈ సమస్య ఏర్పడింది. గతం లో ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవడంతో గాలిదుమారాలు వచ్చినా కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడలేదు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

