ఉచిత నీటి సరఫరాపై జలమండలి కసరత్తు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉచిత నీటి సరఫరాపై జలమండలి కసరత్తు చేస్తున్నది. పేద, మధ్య తరగతి ప్రజలే కాకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని అపార్ట్మెంట్ వాసులకూ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్ మహానగరంలో 10 లక్షల కుటుంబాలకు ఉచిత నీటి సరఫరా పథకంలోకి వస్తారని జలమండలి అంచనా వేసింది. 97 శాతం మేర నగర ప్రజలకు లబ్ధి జరిగే ఈ ప్రక్రియలో విధి విధానాల రూపకల్పనపై ఎండీ దానకిశోర్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థ పరిధిలో అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 50 ఫ్లాట్స్ , 100 ఫ్లాట్స్ దాటిన అపార్ట్‌మెంట్స్‌కు ఏ విధంగా విధానాలు ఉండాలి? ప్రతి నల్లాకు మీటర్ బిగింపు? ఉచిత నీటి సరఫరాతో ప్రభుత్వంపై పడే భారం ఎంత? తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో సమగ్ర నివేదికను మంత్రి కేటీఆర్ అందజేయనున్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు