మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 24, 2020 , 00:48:06

షెల్టర్‌హోమ్‌కు నిరాశ్రయుల తరలింపు

షెల్టర్‌హోమ్‌కు నిరాశ్రయుల తరలింపు

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ప్యారడైజ్‌, అడిక్‌మెట్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద 300మంది వలస కార్మికులు, నిరాశ్రయులను గుర్తించారు. వీరందరినీ ఆర్టీసీ బస్సుల్లో బన్సీలాల్‌పేట్‌లోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన షెల్టర్‌ హోమ్‌కు తరలించా రు. వారికి అక్కడే భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. కాగా మేయర్‌ సతీమణి శ్రీదేవి వారికి ఇంటినుంచి వండి తెచ్చిన భోజనాన్ని వడ్డించారు. వలస కార్మికులకు రోజూ భోజనం పెట్టేందుకు రైల్వేశాఖ ఎలక్ట్రికల్‌ విభాగం ఉద్యోగి శ్రీనివాస్‌, రాంకోటికి చెందిన వ్యాపా రి సాగర్‌ ముందుకొచ్చారు. 


logo